తెలివైన కుందేలు
అనగనగా దండకారణ్య ప్రాంతమునందు ఒక అడవి కలదు. అందు నానావిధములైన జంతువులు నివసించు చుండెవి. ఆ అడవియందు ఒక సింహముకూడ నివసించు చుండెను. సింహమును మృగములకు రాజు అందురు. ఆ మృగరాజునకు ఆకలి విపరీతముగా యున్నందు వలన విచ్చలవిదిగా అడవినందలి జంతువులను చంపి తినుచుండెను. ఆ అడవిలో వుండుటకుకూడ భయపడుచు, బిక్కు బిక్కు మనుచు జీవించు చుండెను.ఒక నాడు మృగరాజులేని సమయముచూచి ఆ అడవిలోని జంతువులన్నీ సమావేశమై, తమనుతాము ఎలా రక్షించుకొనవలనో తర్కించు కొనిరి. అప్పుడు ఒక ముసలి కుందేలు తన అభిప్రాయమును ఈ విధముగా చెప్పెను. "మనమందర్ము గుంపుగా మృగరాజు వద్దకు వెళ్ళి రోజుకొక జంతువు చొప్పున వంతులవారిగా నీవద్దకు ఆహారముగా వచ్చెదమని చెప్పి, దానిని ఒప్పించెను. కుందేలు చెప్పినదానికి అందరు ఒప్పుకొనిరి. ఒకానొక రోజున కుందేలును తీసుకొని అడవిలోని జంతువులన్ని మృగరాజు వద్దకు వెళ్ళి "మృగరాజా మీరు మా అందరిని కొద్ది రోజులలోనే భుజించినచో, తరువాత మీకు ఆకలి తీర్చువారు ఎవ్వరునూ వుండరు. కావున మీరు మమ్ములను వంతుల వారీగా రోజుకొకరిని భుజించినచో మీకు భోజనిమునకు ఇబ్బందివుండదు. మీ ఆకలిని తీర్చుటకు మేము సిద్ధముగా నున్నము." అని చెప్పిరి. ఇది సబబుగా నున్నందున, సింహము రోజున ఒక్కరిని తినుటక్కు సమ్మతించెను. ఈ విధముగా కొన్ని రోజులు గడచిన పిదప ఒకరోజున వృద్ధ కుందేలు వంతు వచ్చెను. ఆ కుందేలు ఈ విధముగా ఆలోచించెను, "ఈ రోజు నా వంతు వచ్చెను. రేపు నా పిల్లలవంతువచ్చును. మేమందరము ఈ విధముగా సింహమునకు బలి కావలసినదేన? ఈ హింస ఇక సాగనివ్వకూడదు. ఈరోజుతో సింహము పని సరి." అని ఒక నిశ్చయమునకు వచ్చెను. చాలా నిదానముగా, ఆలస్యముగా సింహము వద్దకు వెళ్ళెను. సింహమునకు cఅలా ఆకలిగా నుండెను. ఆకలితో విపరీతముగా కోపము వచ్చెను. సింహము ఈ విధముగా ఆలోచించెను. "నేను రేపటినుంచి దొరికిన జంతువును దొరకినట్లుగా భుజంచెదను. ఈ జంతువులకు చాలా గర్వముగా నున్నట్లున్నది. అప్పుడుగాని వీని గర్వము అణగదు. ఇంతలో మెల్లగా, భయము భయముగా, కుందేలు సింహము వద్ద్కు వచ్చి నమస్కరించి ఈ విధముగా పలికెను, "మృగరాజా! ప్రణామము. నేను మీవద్దకు వచ్చుటకు చాలా ముందుగానే బయలుదేరితిని. కానీ, దారిలో వేరొక సింహము ఎదురుపడి, నేనే మృగరాజును. నేనే ఈ అడవికి రాజును. ఈ రోజునుంచి మీరందరు నాకే ఆహారము కావలెను అని గర్జించి పలికినది. నెను ఎంత బ్రతిమలాడినను అదినన్ను వదల లేదు. మీ అనుఙ్ఞ తీసుకొని వత్తునని చెప్పి ఇలా వచ్చితిని." అని పల్కెను. వెంటనే మృగరాజు అయిన సంహమునకు చాలా కోపము వచ్చెను. కుందేలు అబద్ధము చెప్పుచున్నదని తెలుసుకొనలేక వెంటనే కుందేలుతో, "ఓ కుందేలా! నేవు చెపుచున్నది నిజమేనా? నాకు వెంటనే ఆ రెండవ సింహమును చూపుము. వెంటనే దానిని చంపివేసెదను. తరువతనే నిన్ను ఆహారముగా స్వీకరింతును. ఎందుకనగా, ముందుగా నిన్ను చంపి ఆకలి తీర్చుకొన్నచో నాకు ఆ సింహమును ఎవరు చూపుతారు? కావున నాకు ముందుగా ఆ సింహమును చూపుము. శతృవులను మిగల్చరాదు." అని పల్కెను. వెంటనే ఆలస్యము చేయక కుందేలు, మృగరాజు సింహమును తీసుకొని దూరముగా నున్న పాడుబడ్డ బావి వద్ద్కు తీసుకొని వెళ్ళెను. అందులో సగమునకు తక్కువగా నీళ్ళు వుండెను. ఆ బావిని సింహమునకు చూపి "ఓ మృగరాజా! నీ వైరియైన వేరొక సింహము ఈ లోతైన పాడుబడ్డ బావిలో దాగికొని యున్నది. వెంటనే బావిలోనికి దుమికి, దానిని వధింపుము. తదుపరి వెంటనే నన్ను భక్షిచి నీ ఆకలి తీర్చుకొనుము. వెళ్ళుము", అని తొందర పెట్టెను. వెంటనే ఆ తెలివి తక్కువ మృగరాజు కొంచెమే నీరుగల లోతైన బావిలోనికి తొంగి చూచెను. అందులో ఆ చూచుతున్న సింహము యొక్క ప్రతిబింబము కనిపించెను. వెంటనే సింహము గర్జించుచూ ఆ బావిలోకి దుమికెను. నీటిలో మునిగి చనిపోయెను. సింహము బావిలోనికి దుముకగానే కుందేలు, తనతోటి అడవిలోని జంతువులను బావిచుట్టు చేర్పించి చోద్యమును చూపించెను. ఆ కుందేలు తెలివి తేటలకు తోటి జంతువులు జేజేలు పల్కిరి.
నీతి: ఉపాయములేని వానిని ఊరిలోనుంచి తరుమవలెను. సమయ స్పూర్తితో పనులను సాధించుకొనవలెను.